జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు సినిమాలు రాజకీయాలను బ్యాలెన్స్ చేసిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక సినిమాలను కాస్త దూరం పెట్టారు. రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఒప్పుకున్న సినిమాలను సైతం ఆయన పూర్తి చేయలేకపోతున్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ నుండి ఏడాదికి ఒక్క సినిమా వచ్చినా ఆ సినిమాకు భారీగా ఓపెనింగ్స్, కలెక్షన్స్ రావడం విశేషం. దీంతో పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పొలిటీషియన్ గా బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్, రాజకీయ జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాబట్టి ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని ఎవరికీ తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం…
అలా సినిమాల్లోకి ఎంట్రీ
పవన్ కళ్యాణ్ చిన్ననాటి నుండి అసలు హీరో అవ్వాలని, సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదట. తన వదిన, చిరంజీవి సతీమణి సురేఖ పవన్ కళ్యాణ్ అందంగా ఉంటాడు . సినిమాల్లోకి వెళితే సక్సెస్ అవుతాడు అని చెప్పడం వల్ల మొదట సినిమాల్లోకి రావాల్సింది వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
సినిమాల్లో సామాజిక, రాజకీయ అంశాలు
సినిమాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ మొదట నుండి సామాజిక రాజకీయ అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. ఆయన చేసిన సినిమాలు కూడా అదే కోణంలో ఉండేవి. పవన్ కళ్యాణ్ నటించిన జానీ సినిమా, కెమెరామెన్ గంగతో రాంబాబు సహా అనేక సినిమాల్లో సామాజిక రాజకీయ అంశాల గురించే ఉంటుంది.
ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా పవన్ కళ్యాణ్
ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది చిరంజీవి అయినప్పటికీ ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ కూడా ఎంతో కీలకంగా వ్యవహరించారు. చాలామంది పవన్ జనసేన పార్టీతో 2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడని అనుకుంటారు. కానీ 2008లోనే పవన్ యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం అయిన “యువరాజ్యం” పార్టీకి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేశారు. అయితే పవన్ ప్రజారాజ్యంలో ఎంతో యాక్టివ్ గా పని చేసినా చివరికి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం పై తీవ్ర నిరాశ చెందారు. ఆ సమయంలో తన సోదరుడితో రాజకీయంగా విభేదించి ..రాజకీయాలకు కొన్నాళ్లపాటు పూర్తిగా దూరమయ్యారు. అంతేకాకుండా సినిమాలపై దృష్టి పెట్టారు.
గబ్బర్ సింగ్ తో సెకండ్ ఇన్నింగ్స్
అలా సినిమాలు చేస్తున్న సమయంలో గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ సినిమా విజయం తర్వాత వరుస విజయాలు అందుకోవడం పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ లాంటి మాటలు మాంత్రికుడు పరిచయం అవ్వడం జనసేన పార్టీ స్థాపనకు కీలకంగా మారింది. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కు పార్టీ పెట్టాలని ఆలోచన ఉండేది. ఆ ఆలోచనకు త్రివిక్రమ్ కూడా తోడవడంతో పవన్ జనసేన పార్టీని స్థాపించారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ స్పీచ్ లు త్రివిక్రమే చూసుకునేవారు అనే టాక్ కూడా ఉంది.
పార్టీ స్థాపించిన మొదటి ఎన్నికలకు దూరం
సాధారణంగా పార్టీ స్థాపించిన వాళ్ళు ఎన్నికల బరిలో దిగుతారు. 2014 లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో అసలు పోటీ చేయలేదు. ఆయన పార్టీ జనసేన తరఫున సైతం ఎవరు బరిలోకి దిగలేదు ఎన్నికల్లో ఆయన టిడిపి బీజేపీ కూటమికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఇలా పార్టీ పెట్టి పోటీ చేయకుండా ఇతర పార్టీలకు ప్రచారం చేయడం భారత రాజకీయాల్లో అత్యంత అరుదైన ఘటనగా చెప్పుకుంటారు.
నిరాశపరిచిన ఫలితాలు
2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేసినప్పటికీ ఫలితాలు ఆశించిన విధంగా రాలేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవడం ఆయన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అంతేకాకుండా జనసేన పోటీ చేసే స్థానాల్లో కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఆ సమయంలో పవన్ ఎన్నో విమర్శలు అవమానాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా రాజకీయాల్లో సంయమనం పాటించారు. ఆ తర్వాత వచ్చిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో జతకట్టి పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించారు. ఇలా కూడా ఓ రికార్డు క్రియేట్ చేశారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా సేవలు అందిస్తూ జనసేనను మరింత విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ముందు ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ఎలా ఉంటుందో చూడాలి.



