రొటీన్ సినిమాలు కాకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి కీర్తి సురేష్. మహానటి సినిమా విజయంతో కీర్తి సురేష్ సినిమాలు ఎంపిక చేసుకునే స్టైల్ పూర్తిగా మార్చేసింది. ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేసేందుకే ఇష్టపడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా “డోరతి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. 1990 బ్యాక్ డ్రాప్ లో జరిగిన క్రైమ్ పీరియడ్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం…

 

కథనం:

తమిళనాడులోని ఓ పల్లెటూరి వాతావరణంలో సాగే కథనే ఈ సినిమా. కార్తీ (రిషికాంత్), సుబ్బు (సనత్) చిన్ననాటి నుండి ప్రాణ స్నేహితులు. చిన్నతనంలోనే తల్లి, అక్క చనిపోవడంతో అసలు సుబ్బు ఇంట్లో మహిళలే ఉండరు. అంతేకాకుండా సుబ్బు తండ్రికి పరువు, కులం, మగతనం అనే ఒకలాంటి గర్వం, ఒకప్పటి మైండ్ సెట్ ఉంటుంది. అయితే సుబ్బుకి మాత్రం చిన్ననాటి నుండి అమ్మాయి లక్షణాలు ఉంటాయి. కానీ వాటిని బయటకు చూపించకుండా గర్వంగానే కనిపిస్తాడు. ఈ క్రమంలో సుబ్బు సోదరుడు డోరతి (కీర్తి సురేష్) ను పెళ్లి చేసుకకుని ఇంటికి తీసుకొని వస్తాడు. డోరతి ఇంటికి వచ్చిన తర్వాత సుబ్బు ఆమెతో స్నేహంగా ఉంటాడు. ఈ క్రమంలో ఆమె అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. అయితే పరువు పోతుందనే భయంతో సుబ్బు తండ్రి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తాడు. కానీ తండ్రి, అన్నయ్యలే వదినను చంపేశారని సుబ్బు అనుకుంటాడు. మరోవైపు సుబ్బు కోసం చిన్ననాటి స్నేహితుడు కార్తీ ఓ హత్య చేస్తాడు. ఒకపక్క కుటుంబం ఆకృత్యాలు.. మరోపక్క తనలో స్త్రీ లక్షణాలతో సుబ్బు సతమతమవుతుంటారు. ఈ క్రమంలోనే ఒకసారి తాను ట్రాన్స్ జెండర్ అనే విషయాన్ని ఇంట్లో చెప్పి పారిపోతాడు. దీంతో పరువు కోసం సుబ్బు తండ్రి తన కొడుకును ఎలాగైనా హత్య చేయాలని భావిస్తాడు. అసలు డోరతి ఎలా చనిపోయింది.. సుబ్బును అతడి స్నేహితుడు కార్తీ అమ్మాయిగా అంగీకరిస్తాడా? అనేదే ఈ సినిమా కథ.

నటీనటుల పనితీరు

ఈ సినిమాలో రిషికాంత్, సనత్ నటన అద్భుతంగా ఉంటుంది. ఎప్పటిలానే మహానటి కీర్తి సురేష్ తన పర్ఫామెన్స్ అదరగొట్టింది. ఎమోషనల్ సన్నివేశాలు, కీర్తి సురేష్ నటన, ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇతర నటీనటుల పర్ఫామెన్స్ కూడా సహజంగానే ఉంటుంది.

సాంకేతిక విశ్లేషణ& దర్శకత్వం స్క్రీన్ ప్లే:

స్క్రీన్ ప్లే విషయానికి వస్తే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తీసుకున్న పాయింట్ ఎంతో సాహసోపేతంగా అనిపించినా స్క్రీన్ ప్లేను మరింత పగడ్బందీగా మలిచి ఉంటే ప్రేక్షకులను ఆకట్టుకునేది. సెకండ్ హాఫ్ లో కొన్ని సాగదీత సన్నివేశాలు ఉంటాయి. వాటిని కత్తిరిస్తే కథనం వేగంగా ఉండేది.

సంగీతం:

ఇళయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయింది. సినిమాలోని లోతైన భాగవద్వేగాలను చక్కగా ఎలివేట్ చేసింది.

సినిమాటోగ్రఫీ& నిర్మాణం:

తిరునావుక్కురసి కెమెరా పనితనం ఈ సినిమాకు ఎంతో బలాన్ని చేకూర్చింది. 90లో నాటి పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా చూపించాడు. అంతేకాకుండా నాచురల్ లైటింగ్ తో సన్నివేశాలను చాలా చక్కగా చూపించాడు.

ప్లస్ మైనస్ పాయింట్లు:

ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ ప్లస్ గా నిలిచింది. నటీనటుల పర్ఫామెన్స్ 1990లో గ్రామీణ తమిళనాడు వాతావరణంలో చూపించిన విధానం… ఇళయరాజా సంగీతం ఇంటర్వెల్ సీన్ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో సుబ్బు టోన్ ఒక్కసారిగా మారిపోవడం కొంతమందికి నచ్చలేదు. కొన్ని సీన్లు ముందుగానే ఊహించే విధంగా ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో సినిమా సాగదీతగా ఉండడం కొంత బోరింగ్ గా అనిపిస్తుంది.

ముగింపు& తీర్పు:

ఒక ముక్కలో చెప్పాలంటే డార్క్ రా ఎమోషనల్ కథలను ఇష్టపడే వారికి డోరతి కచ్చితంగా నచ్చుతుంది.