రాజకీయ నాయకుల వారసులు చాలామంది తమ తండ్రులు, తాతల పేర్లు చెప్పుకుని రాజకీయాల్లోకి వస్తుంటారు. అయితే అలా వచ్చిన వారిలో కొందరు మాత్రమే తండ్రికి తగ్గ కుమారుడిగా, తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించుకుంటారు. అలాంటి నేతల్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy ) కూడా ఒకరు. జగన్ రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆయన రాజకీయ అరంగేట్రం చేసిన కొంతకాలానికే తండ్రి మరణించడం, ఆ తర్వాత వచ్చిన పరిస్థితులు, జైలు జీవితం ఇలా అనేక ఇబ్బందులను ఎదుర్కొని చివరికి నిలదొక్కుకున్నారు. జగన్ రాజకీయ జీవితంలో ఎన్నో చెప్పుకోదగ్గ విషయాలు, ఎవరికి తెలియని నిజాలు ఉన్నాయి. అలాంటి కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

వైస్ఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి

జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan ) మొదటిసారి 2009లో వైయస్సార్ వారసుడిగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి తొలి ఎన్నికల్లోనే భారీ విజయాన్ని సాధించారు. అయితే ఆ విజయానందం జగన్ కు ఎక్కువ కాలం నిలవలేదు. 2009 సెప్టెంబర్ లోనే తండ్రి వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత రాజకీయంగా, వ్యక్తిగతంగా జగన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వైయస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తూ ఓదార్పు యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగన్ కు ఎంతో క్రేజ్ వచ్చింది.

జగన్ జీవితంలో చీకటి రోజులు

తండ్రి మరణాన్ని మర్చిపోకముందే జగన్ జీవితంలోకి చీకటి రోజులు వచ్చాయి. అక్రమాస్తుల కేసులో ఆయనను 2012 మే 27న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం జగన్ దాదాపు 16 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఈ క్రమంలో న్యాయపోరాటం చేసి 2013 సెప్టెంబర్ లో బెయిల్ పై విడుదలయ్యారు.

రాష్ట్రం విడిపోయాక మొదటి ఎన్నికల్లో ఓటమి

జగన్ విడుదలైన సమయంలోనే తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరుకోగా 2014లో రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో వైఎస్ఆర్సిపీ ఒంటరిగా పోటీ చేసింది. అలా మొదటిసారి పోటీ చేసిన ఎన్నికల్లో జగన్ కు పెద్దగా రాజకీయ అనుభవం లేదని చంద్రబాబుకు ప్రజలు అధికారాన్ని అందించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 67 స్థానాలను కైవసం చేసుకుని ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది.

ఓటమితో కృంగిపోని జగన్

ఓటమి తర్వాత కృంగిపోకుండా జగన్ తన తండ్రి మాదిరిగానే ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు నవంబర్ 6, 2017న ఇడుపులపాయ నుండి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించారు. దాదాపు 14 నెలల పాటు జగన్ ఈ పాదయాత్రను కొనసాగించారు. పాదయాత్రలో 3వేలకు పైగా కిలోమీటర్ నడిచి కోట్లాదిమంది ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా నవరత్నాలు అనే పథకాన్ని ప్రకటించారు. జగన్ ప్రజలకు, ప్రజలు జగన్ కు దగ్గరయ్యారు. దీని ఫలితంగానే 2019 ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలకు గాను 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. అంతేకాకుండా 22 లోక్ సభ స్థానాలను సైతం గెలుచుకుని సత్తా చాటింది. తర్వాత ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన జగన్ 2023 ఎన్నికల్లో కూటమి పై ఓడిపోయారు.

మళ్ళీ ప్రతిపక్షంగా

ఇప్పుడు మరోసారి ప్రతిపక్షంలో కూర్చున్నారు. ప్రస్తుతం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడమే కాకుండా మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. అంతే కాకుండా గ్రామ స్థాయిలో పార్టీని తిరిగి నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల పార్టీ అధ్యకులను కేటాయించడం, సరిగ్గా పనిచేయనివారిని మార్చడం లాంటివి చేస్తున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే జగన్ 2.ఓ చూస్తారని చెబుతున్నారు. తరచూ ప్రజాసమస్యలపై తమ గళాన్ని విప్పుతూ అధికార కూటమిని ప్రశ్నిస్తున్నారు. ఇక రాబోయే ఎన్నికలకు జగన్ పగ్దబండిగా ప్లాన్ చేస్తుండగా ముందు ముందు ఇంకా ఎలాంటి నిర్నయాలు తీసుకుంటారు. పార్టీని నిలబెట్టుకుని రాబోయే ఎన్నికల్లో ఎలా ఫైట్ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే మరో రెండు దఫాల్లోనూ కూటమి పార్టీలు కలిసే పోటీ చేస్తాయని అనేక సార్లు స్పష్టం చేశాయి. ఇలాంటి సమయంలో జగన్ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారో చూడాలి.