మమతా బైజు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్. సాధారణంగా గ్లామరస్ హీరోయిన్లకి త్వరగా పాపులారిటీ వస్తుంది. ఎంత త్వరగా పాపులారిటీ వస్తే అంతే త్వరగా ఫేడ్ అవుట్ అయిపోతుంటారు. కానీ నటనతో అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్లు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో రాణించగలుగుతారు. మమతా బైజు కూడా అలా నటనతో అభిమానులను సంపాదించుకున్న హీరోయినే. ఈ బ్యూటీ కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో 2001లో జన్మించింది. 17 ఏళ్లకే “సర్వోపరి పాలక్కారన్” అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం తర్వాత ఆపరేషన్ జావా, ఖో ఖో, సూపర్ శరణ్య అనే సినిమాలలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఈ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. దీంతో 2021లో కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును సైతం సొంతం చేసుకుంది.

పేమలు సినిమాతో బ్రేక్:

2024లో ఈ హీరోయిన్ ప్రేమలు సినిమాలో నటించింది. ఈ సినిమాతోనే మమతా బైజుకు బ్రేక్ వచ్చింది. మొదట ఈ సినిమాను మలయాళం లో విడుదల చేయగా ఆ తర్వాత తెలుగులోను విడుదల చేశారు. ఈ టీజేన్ లవ్ స్టోరీకి ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఈ చిత్రం తరవాత డ్యూడ్ సినిమాలో నటించగా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అందు కుంది. ఈ చిత్రం తర్వాత సూర్య హీరోగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం తెలుగు ,తమిళ, మలయాళ భాషల్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంతోపాటు మమత బైజు నటించిన మరో బ్యూటిఫుల్ ప్రేమ కథ చిత్రం బెత్లెహం కుటుంబ యూనిట్. ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాను మొదట మలయాళం లో విడుదల చేయగా మంచి విజయం సాధించింది. తర్వాత తెలుగులోనూ విడుదల చేశారు. దీంతో తెలుగులోనూ ఈ సినిమా సూపర్ హిట్ గా గెలిచింది.

వరుస ఆఫర్లతో బిజీ:

మమత బైజు చివరగా చేసిన రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో వరుస ఆఫర్లు అందుకుంటుంది. అయితే తన రెండు సినిమాలతో మమత బైజు ఒక ట్రెండ్ కూడా సెట్ చేసింది. సాధారణంగా ప్రేమించినా, పెళ్లి చేసుకున్నా అబ్బాయి అమ్మాయి కంటే ఒకటి రెండు ఏళ్ళు మాత్రమే పెద్దవాడిగా ఉండాలని ప్రజెంట్ జనరేషన్ యూత్ భావిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా అలానే భావిస్తున్నారు. అయితే ఒకప్పుడు మాత్రం 5 నుండి 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నవారు కూడా పెళ్లి చేసుకునేవారు. అలా పెళ్లి చేసుకుని కలిసిమెలిసి ఉండేవారు.

రీసెంట్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకే ఫార్ములా:

ఇక మమత బైజు రీసెంట్ సినిమాల్లోనూ ఆ ఫార్ములాను కావాలని చెప్పకపోయినా అనుకోకుండా చూపించారు. విశ్వనాథన్ అండ్ సన్స్ సినిమాలో హీరోకు హీరోయిన్ కు మధ్య ఏకంగా 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంటుంది. అయినప్పటికీ సూర్య తన తల్లిని ప్రేమించే విధానం, బిజినెస్ చేయడం, తనను కేర్ గా చూసుకోవడం, ఏదైనా ఆపద వస్తే ప్రాణాలకు తెగించి కాపాడటం మమత బైజును ప్రేమలో పడేలా చేస్తాయి. దీంతో 20 ఏళ్ల ఎస్ గ్యాప్ ఉన్నప్పటికీ మమత సూర్యను లవ్ చేస్తుంది. సూర్య నో చెప్పినప్పటికీ అతని వెంటపడి మరీ చివరికి దక్కించుకుంటుంది. ఈ క్రమంలో కొన్ని సార్లు బాధపడుతుంది కూడా. ఇక ఇదే తరహాలో నవీన్ పాల్ హీరోగా నటించిన బెత్లెహం కుటుంబ యూనిట్ సినిమాలోనూ తనకంటే 8ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న హీరోతో ప్రేమలో పడుతుంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ కంటే 8 ఏళ్ల పెద్దవాడైనప్పటికీ మొదట హీరోయినే ప్రేమలో పడుతుంది. అతడి అమాయకత్వం మరియు కేరింగ్ విధానం నచ్చి ప్రేమలో పడుతుంది. ఈ చిత్రంలో కూడా అతనిని పెళ్లి చేసుకోవాలని ఎంతో కోరుకుంటుంది. చివరికి దక్కించుకుంటుంది.

నెటిజన్ల రెస్పాన్స్ ఎలా ఉంది:

ఇక ఈ రెండు సినిమాలతో మమతా బైజు తనకు తెలియకుండానే నయా ట్రెండ్ క్రియేట్ చేసింది. ఏజ్ గ్యాప్ కాస్త ఎక్కువ ఉంటేనే అమ్మాయిలను అబ్బాయిలు అర్థం చేసుకుంటారు అని మెసేజ్ ఇచ్చింది. దీనితో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమాలపైనే మీమ్స్ కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ 5 నుండి 10 వరకు ఉండటమే మంచిదని నెటిజన్లు సైతం భావిస్తున్నారు.