సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఇచ్చే రెమ్యూనరేషన్ లతో పోలిస్తే ఇప్పుడు భారీగా పెరిగిపోయాయి. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు తీసి లాభాలు చూపిస్తే ఆఫర్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. తీసిన సినిమాకు కొంత హైప్ వచ్చినా ప్రొడ్యూసర్లు భారీగా ఆఫర్ చేస్తున్నారు. ఖరీదైన కార్లు గిఫ్టుగా సైతం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ది ప్యారడైజ్ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

సుకుమార్ శిష్యుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రీకాంత్ ఓదెల చేసిన రెండు సినిమాలకే ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. శ్రీకాంత్ మొదటి సినిమా “దసరా”కు విడుదలకు ముందే భారీ హైప్ వచ్చింది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాటలు, ట్రైలర్ బాగుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు మొదటి సినిమానే పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించడంతో శ్రీకాంత్ పేరు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించింది. ఇక సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తర్వాత హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ మరోసారి నాని హీరోగా ది పారడైజ్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మాస్ ఓరియెంటెడ్ చిత్రంగా దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్ తో తీశారు. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ కలెక్షన్లు మాత్రం భారీగానే వస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది.

రెండో సినిమా రిలీజ్ అవ్వకముందే భారీగా అడ్వాన్స్ లు

అయితే రెండో సినిమా విడుదల కాకముందే శ్రీకాంత్ భారీగా అడ్వాన్స్ లు తీసుకున్నారు అంటూ ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. శ్రీకాంత్ తో ఓ సినిమా కోసం ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ 4 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా నిర్మాత కె.వి.ఎన్ 3 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఓ ఎన్నారై నిర్మాత సైతం 2 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారని ప్రచారం ఉంది.

శ్రీకాంత్ కంటే ముందు మరికొందరు దర్శకులకు సైతం ఇలాగే అడ్వాన్స్ లు

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కంటే ముందు కూడా కొందరు దర్శకులకు ఇలానే నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చి చేతులు కాల్చుకున్నారు. ఒకటి రెండు సినిమాలు చేయగానే భారీగా అడ్వాన్స్ లు ఇచ్చారు. అలా ఇచ్చిన చేసిన సినిమాల రిజల్ట్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి. దీంతో నిర్మాతలు భారీగా నష్టపోయారు. అదే డైరెక్టర్ తో సినిమాలు అగ్రిమెంట్ చేసుకున్న ఇతర నిర్మాతలు అడ్వాన్స్ వెన్నక్కి ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు.

ఇలానే కొనసాగితే ఇండస్ట్రీకే ముప్పు

సినిమాలు విజయం సాధించక ముందే నిర్మాతలు ఇలా ఎందుకు కోట్ల రూపాయల అడ్వాన్స్ లు ఇస్తున్నారు అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఇప్పటికే పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు మూతపడుతున్నా… ప్రొడ్యూసర్లకు నష్టాలు వస్తున్నా కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిర్మాతలు, నిర్మాణ సంస్థలు ఆచి తూచి అడిగేయాలని సూచిస్తున్నారు. లేదంటే మొత్తం ఇండస్ట్రీనే నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.