ఒకప్పుడు సినిమాకి వెళ్లాలంటే ట్రైలర్ లేదా టీజర్ చూసి వెళ్లే వాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో అయితే ఆ సినిమాలోని పాటలు నచ్చితే చాలు చలో అంటూ సినిమాకి వెళ్ళిపోతున్నాం. ఏ సినిమా అయినా సరే బోర్ కొట్టకుండా ఉండాలంటే మ్యూజిక్ టచ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాంటి మ్యూజిక్ టచ్ ఉన్న సినిమాలు, అందులో యూట్యూబ్ ను షేక్ చేసిన టాప్ 5 పాటలు ఏవో ఇప్పుడు చూద్దాం.

-1000 మిలియన్లకు దగ్గరైన బుట్టబొమ్మ

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం మూవీలోని బుట్ట బొమ్మ సాంగ్ 952 మిలియన్ల వ్యూస్ తో ఫస్ట్ ప్లేస్ లో దూసుకెళ్తోంది. అంటే ఇది వెయ్యి మిలియన్ల వ్యూవ్స్ కు దగ్గరగా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే నటించింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి హిట్ జాబితాలో చేరిపోయింది. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందిస్తే, మనందరి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇక సింగర్ అర్మాన్ మాలిక్ తన గొంతుతో ఈ పాటకు ప్రాణం పోసి ఫస్ట్ అండ్ బెస్ట్ సాంగ్ అని నిరూపించారు.

-యూట్యూబ్ వ్యూవ్స్ నే మడతపెట్టిన పాట

అకేషన్ ఏదైనా సరే ఈ పాట మాత్రం డీజే బాక్సుల్లో మాస్ మసాలా పాటల మోత మోగిపోవాల్సిందే. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన గుంటూరు కారం మూవీలోనూ అలాంటి ఓ పాట ఉంది. అదే కుర్చీ మడత పెట్టి సాంగ్… ఆ టైంలో ఈ పాట జనాలను ఒక కుదుపు కుదిపేసిందనే చెప్పాలి. ఈ సాంగ్ 831 మిలియన్ వ్యూస్ తో టాప్ 2 ప్లేస్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో మహేష్ బాబు సరసన మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీ లీల నటించింది. రామ జోగయ్య శాస్త్రి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ కాంబినేషన్ లో ఈ పాట వచ్చింది. ఈ పాటను సింగర్స్ సాహితీ చాగంటి, శ్రీకృష్ణ వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. అంతేకాదు ఈ సాంగ్ లో ప్రిన్స్ మహేష్ బాబు డైలాగ్స్ కూడా యాడ్ చేయడంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇవన్నీ ఒకెత్తు అయితే శ్రీ లీల డ్యాన్స్ మరో సెన్సేషన్. ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు సంవత్సరాలు కావస్తున్నా కూర్చీని మడత పెట్టి పాట మాత్రం ఇప్పటికీ అదే ఫ్లోలో దూసుకెళ్తుంది.

-అత్యధిక వ్యూవ్స్ తో ఆగం చేసిన రాములో రాములో

రాములో రాముల నన్ను ఆగం చేసిందిరో… అంటూ యూట్యూబ్ నే ఆగం చేసిన పాట 798 మిలియన్ వ్యూస్ తో టాప్ 3 లో నిలిచింది. స్టార్ హీరో అల్లు అర్జున్ పూజ హెగ్డే కలిసి నటించిన అలా వైకుంఠపురం మూవీలోని ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా వేస్తామని మ్యూజిక్ కంపోజ్ చేశారు. అనురాగ్ కుల్కర్ని మంగ్లీ సత్యవతి కలిసి దీన్ని పాడారు. ఈ పాట పార్టీలలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి టాబు, జయరాం సుశాంత్, నివేత పేతురాజ్, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు.

-సామి సామి అంటూనే టాప్ 4లో నిలిచిన అల్లు అర్జున్ మరో పాట

పాన్ ఇండియా సినిమా పుష్ప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టింది. సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలోని సామి సామి అంటుంటే పాట 773 మిలియన్ వ్యూస్ తో టాప్ 4 లో నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందాన నటించింది. సామీ సామీ అంటూ ఈ పాటకు రష్మిక వేసిన హుక్ స్టెప్ యూత్ ని మెస్మరైజ్ చేసింది. అంతేకాదు ప్రతి పెళ్లిలో ఈ స్టెప్ ట్రెండింగ్ గా నిలిచింది. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ రాశారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోస్ట్ చేస్తే తెలుగులో మౌనిక యాదవ్ హిందీలో సునిధి చౌహన్ వారి వోకల్స్ తో వావ్ అనిపించారు.

-పాటే బంగారమాయేనే అనిపించేలా శ్రీవల్లి పాట

ఒక అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి అందాన్ని వర్ణిస్తూ పాడిన పాట అత్యధిక వ్యూస్ తో టాప్ ఫైవ్ లో నిలిచింది. అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,స్టార్ హీరోయిన్ రష్మిక మందన కలిసి నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప లోని శ్రీవల్లి సాంగ్. ఈ మూవీని డైరెక్టర్ సుకుమార్ తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ 691 మిలియన్ వ్యూస్ సాధించి 5వ స్థానంలో నిలిచింది. ఈ పాటకి తెలుగులో చంద్రబోస్ లిరిక్స్ రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఈ సాంగ్ కి మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఎంతోమందికి ఫేవరెట్ సింగర్ అయిన సిద్ శ్రీరామ్ తన స్వరంతో అందరూ సలాం కొట్టేలా పాడాడు. ఇకపోతే ఈ పాట ప్రతి అమ్మాయి ఫేవరెట్ సాంగ్స్ లిస్టులో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు