సినిమాల్లో చాలా జానర్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను థియేటర్ సీట్లకు కట్టివేసేవి మాత్రం థ్రిల్లర్ సినిమాలే. సాధారణ ప్రేమ కథ సినిమాలైనా… మాస్ ఓరియెంటెడ్ సినిమాలైనా ప్రేక్షకుడు కేవలం చూస్తూ ఎంజాయ్ చేస్తాడు. అదే థ్రిల్లర్ సినిమాలను మాత్రం ఎంతో ఆసక్తిగా ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకుండా ఎంతో ఆసక్తితో చూస్తుంటాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తాడు. కాబట్టి ఈ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా మలయాళం లో ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలు వస్తుంటాయి. ఈ జానర్ సినిమాలు ఇష్టపడేవాళ్ళు కూడా ఎక్కువ మలయాళ చిత్రాలనే చూస్తుంటారు. కాబట్టి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు సైతం మలయాళ సినిమాలకు అలవాటుపడ్డారు. అలాంటి వాళ్లకోసం మిస్ అవ్వకుండా చూడాల్సిన టాప్ 5 మలయాళ థ్రిల్లర్ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
దృశ్యం ఫ్రాంచైజ్
మలయాళంలో మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా దృశ్యం. ఈ సినిమాను ఒక ఫ్రాంచైజ్ గా విడుదల చేశారు. మొదట కేవలం మలయాళంలో వచ్చిన ఈ సినిమా తర్వాత తెలుగులోనూ తీశారు. అక్కడ ఇక్కడ కూడా దృశ్యం సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. బాలీవుడ్ లోనూ తెరకెక్కించగా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో హీరో కూతురు ఒకరిని హత్య చేయగా అతని కుటుంబం నుండి హీరో ఎలా తప్పించుకున్నాడు. పోలీసుల కళ్ళు కప్పి వారికి దొరకకుండా ఎలా మేనేజ్ చేశాడు అనేదే ఈ సినిమా కథ. సినిమాను మొదట చూసిన వాళ్ళు అస్సలు రాబోయే ట్విస్ట్ లను ఊహించరు. ఈ చిత్రం అన్ని భాషలలో కూడా మంచి విజయం సాధించింది.
ఇరట్ట
మలయాళంలో మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇరట్ట. ఇది ఒక డార్క్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాలో జోజూ జియార్జ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా కథ పోలీస్ స్టేషన్ లో పోలీస్ డెడ్ బాడీ తో మొదలవుతుంది. ఆ పోలీసును చంపింది ఎవరు? ఎలా చనిపోయాడు? అనేది ఈ సినిమా అసలు కథ. ఇండియాలోనే ఓ మోస్ట్ ఇన్వెస్టిగేటివ్ సినిమాగా ఈ సినిమాను చెబుతుంటారు. ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో పాటు భారీ కలెక్షన్లు కూడా వచ్చాయి. తెలుగులోనూ ఇప్పటికే చాలామంది ఈ సినిమా చూశారు.
ముంబై పోలీస్
మలయాళం లో వచ్చిన పోలీస్ వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా ముంబై పోలీస్. ఈ సినిమా 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమార్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఈ చిత్రంలో హీరోకు యాక్సిడెంట్ జరగడం, ఆ తర్వాత మెమోరీ లాస్ అవ్వడం లాంటి కీలక సన్నివేశాలు ఉంటాయి. తెలుగు ప్రేక్షకులు సైతం సైతం ఈ సినిమాను ఒక్కసారి చూస్తే ఫిదా అయిపోతారు.
మంజుమల్ బాయ్స్
కొన్ని సినిమాలు నవ్వులు పూయించడంతోపాటు థ్రిల్లింగ్ గా కూడా ఉంటాయి. అలాంటి సినిమాలలో మంజుమల్ బాయ్స్ కూడా ఒకటి. ఈ సినిమాను నిజజీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా డైరెక్టర్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఒక స్నేహితుల గ్యాంగ్ పర్యాటక ప్రదేశానికి వెళ్లడం …అక్కడ ఒకరు భారీ లోయలో పడటం మీద సినిమా కథ ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాకు ఇతర భాషల్లో పెద్దగా రెస్పాన్స్ రానప్పటికీ మలయాళంలో మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఛాన్స్ ఉంది.
2018
మలయాళంలో వచ్చిన మరో థ్రిల్లర్ 2018. ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలోనే ఒక ఎపిక్ చిత్రంగా చెబుతుంటారు. ఈ సినిమాను కేరళను ముంచేసిన వరదల ఆధారంగా తెరకెక్కించారు. క్షణాల్లో ముంచెత్తే వరదల నుండి ప్రజలు ప్రాణాలను ఎలా కాపాడుకున్నారు…. సినిమాలో హీరో ఎలా ఫైట్ చేశాడు అనేదే ఈ సినిమా. ఈ చిత్రంలో టోవినో థామస్ హీరోగా నటించాడు. ఈ సినిమా మలయాళంలో వచ్చినప్పటికీ ఇప్పటికే చాలా మంది తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమాను చూశారు. ఒకవేళ మీరు థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్లు అయితే కచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే.



