టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ( Sree Vishnu ) నటించిన తాజా చిత్రం కామ్రేడ్ కళ్యాణ్ ( Comrade Kalyan ). ఈ సినిమాలో మహిమ నంబియుర్ ( Mahima Nambiar ) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు జానకీరామ్ మారెళ్ళ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. మొదటి రోజు సినిమాకు మంచి కలెక్షన్స్ రాగా.. రెండో రోజు కూడా కామ్రేడ్ కళ్యాణ్ భారీగానే రాబట్టాడు. రెండు రోజుల్లో సినిమాకు మొత్తం ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం…

2వేల స్క్రీన్ లలో విడుదలైన సినిమా:

ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 2వేలకు పైగా స్క్రీన్ లలో విడుదల అయింది. ఏపీ, తెలంగాణ లో 900 స్క్రీన్ లలో, కర్ణాటక తమిళనాడు ఇతర ప్రాంతాల్లో 500 స్క్రీన్ లలో విడుదల చేశారు. అంతేకాకుండా ఓవర్సీస్ లో 600 స్క్రీన్ లలో విడుదల చేశారు. మొదటి రోజు ఈ చిత్రానికి 2.10 కోట్ల రూపాయలు నెట్, 2.40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కాగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కామ్రేడ్ కళ్యాణ్ సినిమా 4.15 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది.

టికెట్స్ బుకింగ్ ట్రెండ్ ఎలా ఉంది:

ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, దసరా సెలవులు సైతం కలిసి రావడంతో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే శనివారం సినిమాకు భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి. అక్టోబర్ 10 ఉదయం గంటకు 5వేల టికెట్స్ చొప్పున బుకింగ్స్ జరిగాయి. ఇప్పటివరకు ఈ చిత్రానికి 125k టికెట్స్ బుక్ అయినట్టు సమాచారం.

అసలు కామ్రేడ్ కళ్యాణ్ కథ ఏంటి:

1992 బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆంధ్ర- ఒడిస్సా బార్డర్ లో జరిగే కథ ఇది. సినిమా థియేటర్ ఓనర్ అయిన కళ్యాణ్, బాలయ్య ఫ్యాన్ అయిన సరస్వతమ్మ (రాధికా శరత్ కుమార్) తో హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా సరస్వతమ్మ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తుంది. దీంతో తన తల్లిని కాపాడిన హీరోయిన్ తో హీరో ప్రేమలో పడతాడు. అయితే అప్పటికే హీరోయిన్ కుటుంబంపై ఐదు లక్షల అప్పు ఉంటుంది. అది హీరోయిన్ తో పెళ్లికి అడ్డంకిగా మారుతుంది. ఆ అప్పు తీర్చడం కోసం ప్రభుత్వం ఇచ్చే నగదు బహుమతి కోసం హీరో నక్సలైట్ గా నటించి లొంగిపోవాలని అనుకుంటాడు. కానీ నిజమైన నక్సలైట్ల మధ్యకు వెళ్లడంతో అక్కడ ఏం జరిగింది .. అక్కడ నుండి తప్పించుకున్నాడా… హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నాడా అనేదే ఈ సినిమా.

శ్రీ విష్ణుకు మరో హిట్ పడిందా?

శ్రీ విష్ణు తన కెరీర్ మొదటి నుండి విభిన్నమైన సినిమాలనే ఎంచుకుంటున్నాడు. కెరీర్ ప్రారంభంలో సైడ్ హీరోగా నటించిన శ్రీ విష్ణు ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి అభిమానులను సంపాదించుకున్నాడు. నీది నాది ఒకే కథ సినిమా తర్వాత శ్రీ విష్ణు క్రేజ్ పెరిగింది. తాజాగా చేసిన కామ్రేడ్ కళ్యాణ్ సినిమా కూడా ఒక డిఫరెంట్ జోనర్ లో వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీ విష్ణు చేసిన ప్రతి సినిమాలో కొత్తదనం కనిపిస్తుంది. తాజాగా చేసిన కామ్రేడ్ కళ్యాణ్ సినిమా పైనా పాజిటివ్ రెస్పాన్స్ ఏ వినిపిస్తోంది. మరోవైపు ప్రస్తుతం దసరా పండుగ ఉండడం సెలవులు రావడంతో థియేటర్లో పెద్దగా సినిమాలేవి లేవు. దీంతో కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకు కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే శ్రీ విష్ణు ఖాతాలో మరో హిట్ పడుతుందని విశేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా గనక హిట్ పడితే శ్రీ విష్ణు క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ శ్రీ విష్ణు సినిమాలకు అభిమానులు పెరిగిపోయారు. దాంతో ఓపెనింగ్స్ కూడా బాగానే వస్తున్నాయి.