2026లో తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించాయి. అయితే ఒక సినిమాకు ఓపెనింగ్ రోజునే భారీ కలెక్షన్లు రావడం మాత్రమే కాకుండా.. విడుదలైన తర్వాత కూడా ఎక్కువ రోజుల పాటు రోజుకు రూ.కోటికి పైగా షేర్ సాధించడం ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో పలు సినిమాలు తమ సత్తా చాటాయి. అలా
2026లో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక రోజుల పాటు రూ.కోటి ప్లస్ షేర్ సాధించిన సినిమాల జాబితాలో మాస్ రాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమా ఏకంగా 20 రోజుల పాటు రోజుకు రూ.కోటి కంటే ఎక్కువ షేర్‌ను రాబట్టింది. దీంతో ఈ ఏడాది ఈ విభాగంలో అత్యధిక రోజుల రికార్డును సొంతం చేసుకుంది.
17 రోజులు కోటి ప్లస్ షేర్ రాబట్టిన “మన శంకర వరప్రసాద్ గారు”
ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీసి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా 17 రోజుల పాటు కోటి ప్లస్ షేర్‌ను సాధించి రెండో స్థానంలో నిలిచింది.
మూడో స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా ఉంది. ఈ చిత్రం 14 రోజుల పాటు రోజుకు రూ.కోటి కంటే ఎక్కువ షేర్‌ను రాబట్టింది. మొదటి మూడు స్థానాల్లో ఉన్న సినిమాలు రెండు వారాలకు పైగా కోటి షేర్ మార్క్‌ను కొనసాగించడం విశేషంగా నిలిచింది.
11 రోజులపాటు కోటి ప్లస్ షేర్ రాబట్టిన రాజాసాబ్, ది ప్యారడైజ్
ఇక పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’, నాచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమాలు చెరో 11 రోజుల పాటు కోటి ప్లస్ షేర్‌ను సాధించాయి.
10 రోజుల పాటు కోటికి పైగా షేర్ రాబట్టిన మూడు సినిమాలు
సమంత కీలక పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’, అక్కినేని అఖిల్ ‘లెనిన్’, సూర్య హీరోగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలు చెరో 10 రోజుల పాటు రోజుకు రూ.కోటి కంటే ఎక్కువ షేర్‌ను రాబట్టాయి. దీంతో ఈ మూడు చిత్రాలు కూడా టాప్ జాబితాలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.
10 రోజుల కంటే తక్కువ కోటి ప్లస్ షేర్ రాబట్టి సినిమాలు ఇవే
నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా 7 రోజుల పాటు కోటి ప్లస్ షేర్‌ను సాధించింది. ఆ తర్వాత రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, కిరణ్ సబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాలు చెరో 6 రోజుల పాటు ఈ మార్క్‌ను కొనసాగించాయి. ఇలా ఈ ఏడాది ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటి ఎక్కువ రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ రాబట్టిన టాప్ 11 సినిమాల జాబితాలో ఈ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. ఇక ఇప్పటికే ఏడాది చివరి దశకు చేరుకుంది.
20 రోజులపాటు కోటి పైగా షేర్ రాబట్టిన ఏకైక సినిమా
దాంతో ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో 20 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ రాబట్టి మొదటి స్థానంలో నిలిచిన మాస్ రాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రాన్ని ఏదైనా సినిమా క్రాస్ చేస్తుందా అని ట్రేడ్ పండితులతో పాటు మామూలు సినీ లవర్స్ కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ 20 కంటే ఎక్కువ రోజులపాటు కోటి కంటే ఎక్కువ కలెక్షన్లను రాబట్టడం మామూలు విషయం కాదని… అలా ఈ ఏడాది ఏదైనా సినిమా చేస్తే అది కూడా భారీ బ్లాక్ బాస్టర్ సాధించడం మాత్రమే కాకుండా అనేక కొత్త రికార్డులను సృష్టించడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఏడాది ఇంకా విడుదలకు చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. అయితే సినిమా నచ్చితేనే ప్రేక్షకులు థియేటర్ లకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మిగిలి ఉన్న రోజుల్లో ఏదైనా సినిమా ‘ఇరుముడి’ రికార్డును బ్రేక్ చేస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఏదైనా సినిమా ఇరుముడి రికార్డు బ్రేక్ చేస్తుందా లేదా అనేది.



