తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఏ స్థాయిలో ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం మన టాలీవుడ్ చిత్రాలు మాత్రమే కాకుండా అనేక ఇతర భాష చిత్రాలు కూడా మన ప్రాంతంలో అద్భుతమైన రీతిలో ప్రేక్షకాదరణ పొందిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇదిలా ఉంటే ఒక సినిమా సాధించిన షేర్‌ను బట్టి బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రానికి వచ్చిన ఆదరణను అంచనా వేయవచ్చు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యధిక షేర్ రాబట్టిన సినిమాల జాబితాలో పలు భారీ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. అందులో ఒక డబ్బింగ్ సినిమా ఉండడం కూడా విశేషం. ఈ టాప్ 10 జాబితాలో ఏ సినిమా ఎంత షేర్ సాధించిందో ఇప్పుడు చూద్దాం.

1. ఆర్ఆర్ఆర్ ( RRR )

ఈ జాబితాలో రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి స్థానంలో ఉంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.272.31 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఈ సినిమా రూ.415.00 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ అగ్రస్థానంలో నిలిచింది.

2. పుష్ప 2: ది రూల్ ( Pushpa The Rule )

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా రూపొందిన ఈ సినిమా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.226.92 కోట్ల షేర్ సాధించింది. ఇక గ్రాస్ పరంగా రూ.346.70 కోట్లు రాబట్టింది. దీంతో భారీ షేర్ సాధించిన సినిమాల్లో ఇది రెండో స్థానాన్ని దక్కించుకుంది.

3. బాహుబలి 2: ది కన్‌క్లూజన్ ( Bahubali 2 )

ప్రభాస్ ప్రధాన పాత్రలో తలకెక్కిన ఈ సినిమా రూ.204.00 కోట్ల షేర్ సాధించింది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.330.00 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో రూ.200 కోట్లకు పైగా షేర్ సాధించిన సినిమాల జాబితాలో ఇది మూడో స్థానంలో నిలిచింది.

4. కల్కి 2898 ఏడీ ( Kalki 2898 AD )

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.187.27 కోట్ల షేర్ రాబట్టింది. ఈ చిత్రానికి రూ.296.30 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో అత్యధిక షేర్ సాధించిన సినిమాల్లో నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుంది.

5. దేవర: పార్ట్ 1 ( Devara )

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం రూ.162.80 కోట్ల షేర్ సాధించింది. ఇక గ్రాస్ వసూళ్ల విషయానికి వస్తే రూ.237.55 కోట్లు రాబట్టింది. దీంతో ఈ సినిమా టాప్ 10 జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది.

6. పెద్ది ( Peddi )

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.150.85 కోట్ల షేర్ రాబట్టింది. ఈ చిత్రానికి రూ.234.30 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో అత్యధిక షేర్ సాధించిన సినిమాల్లో ఆరో స్థానాన్ని దక్కించుకుంది.

7. సలార్: పార్ట్ 1 ( Salaar )

ఈ చిత్రం సినిమా కూడా భారీ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం రూ.150.73 కోట్ల షేర్, రూ.234.05 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దీంతో ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది.

8. మన శంకర వర ప్రసాద్ గారు ( Mana Shankara Varaprasad Garu )

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.149.61 కోట్ల షేర్ సాధించింది. ఈ చిత్రానికి రూ.231.60 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో టాప్ 10 జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది.

9. ఓజీ  ( OG )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం రూ.132.95 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఈ చిత్రానికి రూ.200.30 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో అత్యధిక షేర్ సాధించిన సినిమాల్లో తొమ్మిదో స్థానాన్ని సొంతం చేసుకుంది.

10. సంక్రాంతికి వస్తున్నాం ( Sankranthiki Vastunnam )

ఈ జాబితాలో విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పదో స్థానంలో ఉంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.132.63 కోట్ల షేర్ రాబట్టగా.. రూ.217.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.