భారీ అంచనాలతో విడుదలైన సినిమాకు కూడా పెద్ద స్థాయిలో నెగిటివ్ టాక్ వస్తే.. వీకెండ్ ముగిసి వీక్ డేస్ ప్రారంభం కాగానే కలెక్షన్లు తీవ్ర స్థాయిలో పడిపోతూ ఉంటాయి. కానీ భారీ నెగిటివ్ టాక్‌ను కూడా తట్టుకొని నిలబడే చిత్రాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో నాని, కయాదు లోహర్ జంటగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ ఒకటి.

నెగిటివ్ టాక్ నుండి మొదలై హిట్ టాక్

ఈ మూవీ అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలై.. అదే స్థాయిలో నెగిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. దాంతో ఈ మూవీ కనీస కలెక్షన్లను కూడా రాబట్టడం కష్టమే అని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ భారీ నెగిటివ్ టాక్‌ను కూడా తట్టుకొని నిలబడిన ఈ మూవీ.. ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. అలాగే హిట్ స్టేటస్‌కు అత్యంత దగ్గరగా వచ్చింది.

ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన 11 రోజుల బాక్సాఫీస్ రన్ పూర్తయింది. ఇక ఇప్పటివరకు ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వారీగా కలెక్షన్లు:

నైజాం – రూ.39.10 కోట్లు
సీడెడ్ – రూ.6.46 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.6.36 కోట్లు
ఈస్ట్ – రూ.3.86 కోట్లు
వెస్ట్ – రూ.2.00 కోట్లు
గుంటూరు – రూ.3.53 కోట్లు
కృష్ణ – రూ.2.97 కోట్లు
నెల్లూరు – రూ.1.81 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.66.09 కోట్ల షేర్, రూ.107.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

ఇతర ప్రాంతాల్లో ప్యారడైజ్ కలెక్షన్లు

కర్ణాటక – రూ.5.76 కోట్లు
తమిళనాడు, కేరళ – రూ.1.92 కోట్లు
హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ.5.09 కోట్లు
ఓవర్సీస్ – రూ.14.67 కోట్లు

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ‘ది ప్యారడైజ్’ చిత్రానికి రూ.93.53 కోట్ల షేర్, రూ.169.80 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కాయి.

ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ.101.10 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం రూ.102.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది.

ఈ చిత్రం మరో రూ.8.97 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను పూర్తి చేసుకుని హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. ఈ మూవీ హిట్ స్టేటస్‌ను అందుకుంటుందా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉన్నా.. తీవ్రమైన నెగిటివ్ టాక్ తెచ్చుకొని ఈ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి హిట్ స్టేటస్‌కు ఇంత దగ్గరగా రావడం అనేది చాలా గొప్ప విషయం అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.