టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అందం, ఫిట్నెస్‌తో కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. 70ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిగా కనిపిస్తూ నాగ్ అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఓ వైపు బిగ్ బాస్ మరోవైపు సినిమాతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. కేవలం తెలుగు సినిమాలకే పరిమితం అవ్వకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షలను అలరిస్తున్నాడు. నాగ్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అందులో ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రాలు సైతం ఉన్నాయి. నాగ్ కెరీర్ లోనే గుర్తుండి పోయే సినిమాల్లో ఒకటి శివ అయితే మరొకటి గీతాంజలి. ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికీ ఈ చిత్రం టీవీలో వస్తే మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు.
టాలీవుడ్ లో రీరిలీజ్ ల జోరు
అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ల జోరు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ప్రేక్షకుల మనసు దోచుకున్న సినిమాలను ఇప్పుడు థియేటర్లలో మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. హీరోల బర్త్డేలు లేదంటే సినిమా విడుదలైన తేదీలు ఇలా సందర్భాన్ని బట్టి ఒకప్పటి సినిమాలను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గీతాంజలి సినిమాను సైతం ఇప్పటికే ఒకసారి రీ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ కల్ట్ క్లాసిక్ సినిమాను నవంబర్ 13వ తేదీన 4k వెర్షన్ లో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మెరుగైన పిక్చర్ క్వాలిటీతో, సౌండ్ తో తెలుగు తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సినిమా గురించి ఎవరికి తెలియని నిజాలు
ఈ సినిమా గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన మౌనరాగం సినిమా చూసి నాగార్జున ఇంప్రెస్ అయ్యారు. దీంతో ఎలా అయినా మణిరత్నంతో ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు మణిరత్నం వాకింగ్ వెళ్లే సమయంలో నాగార్జున కూడా ఆయన వెంట వెళ్లేవారు. అలా కొన్ని నెలల పాటు తన ఇంటివద్ద తెల్లవారుజామున వెయిట్ చేసి మరీ మణిరత్నంతో కలిసి వాకింగ్ వెళ్లేవారు. అలా వెళుతూ తనతో సినిమా చేయాలని అడిగారు. అదే సమయంలో మణిరత్నం గీతాంజలి సినిమా కథను రాసుకోగా నాగార్జుననే హీరోగా పెట్టి తీశారు. అంతేకాకుండా ఇప్పటివరకు మణిరత్నం అనేక తమిళ సినిమాలు తీసినప్పటికీ అవి తెలుగులో డబ్ చేశారు. కానీ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఏకైక తెలుగు సినిమా గీతాంజలినే కావడం విశేషం.
సినిమాలో హీరోయిన్ పేరు వెనుక ఒక కథ
గీతాంజలి సినిమాలో హీరోయిన్ క్యాన్సర్ తో బాధపడుతుంది అన్న సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్ పేరు వెనక కూడా ఒక కథ ఉంది. ఢిల్లీలో క్యాన్సర్ తో బాధపడుతున్న 11 ఏళ్ల ఓ బాలిక తన జీవితం గురించి డైరీలో రాసేది. ఆ డైరీ గురించి ఒక పేపర్ లో చదివిన మణిరత్నం భావోద్వేగానికి గురై ఆ బాలిక పేరునే సినిమాలో హీరోయిన్ కి పెట్టి గీతాంజలి సినిమాను తెరకెక్కించారు. అంతేకాకుండా ఒక మంచి సినిమా చేయాలంటే వందల రోజులు తీసుకుంటారు. కానీ అప్పట్లోనే మణిరత్నం కేవలం 60 రోజుల్లోనే గీతాంజలి సినిమా షూటింగ్ పూర్తి చేయడం విశేషం.
హీరోయిన్ ఎంపికలో ఇంట్రెస్టింగ్ స్టోరీ
ఈ సినిమా విజయంలో హీరోయిన్ గిరిజ పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనదనే చెప్పాలి. సినిమాలో ఫ్రెష్ ముఖంగా గిరిజ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక గిరిజను మణిరత్నం ఓ పెళ్లిలో చూశాడు. ఆ పెళ్లి కూడా మరి ఎవరిదో కాదు తనదే. గిరిజను తన పెళ్లిలో చూసిన మొదటిసారే హీరోయిన్ గా సరిపోతుందని భావించి గీతాంజలి సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. నటనతో ఎలాంటి సంబంధం లేని గిరిజకు రెండు నెలలపాటు శిక్షణ ఇచ్చి మరి ఈ సినిమాలో తీసుకున్నారు.



