ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ – పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ – కాంబినేషన్ లో తెరెకెక్కుకుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా రాకా. ఈ సినిమా పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ లోనూ సామాన్య ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ మొదటి సారి ఈ సినిమాలో మూడు డిఫరెంట్ వేరియేషన్స్ అంటే త్రిబుల్ రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ టాక్ పై క్లారిటీ లేదు. అలానే భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్ , హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరెకెక్కుతున్నఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండడంతో పాటు ఈ సినిమాకు సంబంధించి ఏ క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చిన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది.
పుష్ప-2 తరువాత బన్నీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మరి ముఖ్యంగా స్టోరీ సెలెక్షన్ , డైరెక్టర్స్ సెలెక్షన్ ఇలా ప్రతి విషయంలోనూ యూనిక్ గా స్పెషల్ గా ఉండే విదంగా ప్లాన్ చేసుకొంటున్నాడు. బన్నీ పుష్ప కి ముందు ఓ లెక్క, పుష్ప తరువాత ఓ లెక్క అన్నట్లుగా ఉంది. సుకుమార్ అల్లు అర్జున్ కి పుష్ప సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వడంతోనే కాకుండా బన్నీ స్టామినాను బాలీవుడ్ రేంజ్ కి తీసుకువెళ్లాడు అని చెప్పడంతో ఎటువంటి సందేహం లేదు. అయితే పుష్ప -2 తరువాత అల్లు అర్జున తో సినిమా చేయడానికి చాలా మంది డైరెక్టర్స్ పోటీ పడ్డారు.
అయితే పుష్ప -2 సినిమా తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేద్దాం అని అనుకున్నాడు, అయితే ఈసారి త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేయబోయేది మైథలాజికల్ జానర్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది అనే టాక్ కూడా బయటకు వచ్చింది. కానీ మధ్యలో ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలు వల్ల ఆగిపోవడం జరిగింది. ఈ సబ్జెక్టు తోనే గురూజీ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు. ఇక పుష్ప -2 తరువాత అల్లు అర్జున్ లైన్ అప్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతోంది. ఓ పక్క అల్లు అర్జున్ అట్లీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంటూనే తరువాత ఏ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలనుకుంటున్నాడో ఫుల్ క్లారిటీ అండ్ పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. అట్లీ సినిమా తరువాత అల్లు అర్జున్ చేయబోయే తరువాత సినిమా లోకేష్ తోనే . ఈ సినిమా సబ్జెక్టు పై లోకేష్ టేకింగ్ పై బన్నీ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు అనే టాక్ వినిపిస్తోంది.

ప్రెజెంట్ అల్లు అర్జున్ ఫోకస్ అంతా “రాకా “సినిమా మీదనే ఉంది. సినిమా ఇండస్ట్రీ లో హీరోస్ రెమ్యూనేషన్స్ గురుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ సహజంగానే వినిపిస్తోంది. సినిమా సినిమాకు హీరోస్ రెమ్యూనరేషన్స్ పెంచడం సర్వసాధారణమే ఇందులో కొత్త ఏమి లేదు. సినిమా హిట్ అయితే రెమ్యూనరేషన్ ఓ లెక్క ఉంటోంది, ప్లాప్ అయితే రెమ్యూనరేషన్ ఓ లెక్క ఉంటోంది, ఇది అందరికి తెలిసిన విషయమే.
ఇక అసలు విషయం ఏంటంటే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘రాకా’పై ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన డిబేట్ కొనసాగుతోంది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరెకెక్కతోంది అని అందరికి తెలిసిన విషయమే. తాజగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
‘రాకా’ సినిమా కోసం అల్లు అర్జున్ ముందస్తుగా మాట్లాడుకున్న పారితోషకం కాకుండా, లాభాలలో వాటా తీసుకుబోతున్నట్లు టాక్ బయటకు వచ్చింది. ప్రెజెంట్ బిగ్ హీరోస్ అందరూ రెమ్యూనరేషన్స్ కి బదులుగా సినిమా రిలీజ్ అయ్యాక అందులో పెద్ద మొత్తం లో వాటాలు తీసుకుంటున్నారు, ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే రాకా సినిమా బ్లాక్‌బస్టర్ అయితే ఆయనకు ఏకంగా రూ.300 కోట్ల వరకు ముడుతాయని ట్రేడ్ వర్గాలు నుండి సమాచారం కానీ, సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థగానీ, చిత్ర యూనిట్ గానీ ఇప్పటివరకు ఈ బడ్జెట్ లేదా రెమ్యునరేషన్ విషయాలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరెకెక్కుతోంది కాబట్టి ఇందులో నటిస్తున్న నటీనటులకు కూడా రెమ్యూనరేషన్స్ చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఈ సినిమాలో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి అగ్ర హీరోయిన్లు నటించడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఇంకా బాగా పెరిపోయాయి. సో బిగ్ కాస్టింగ్ , ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తుండం వల్ల బడ్జెట్ సహజంగానే పెరిగుతోంది.
మామూలుగానే పెద్ద హీరోల సినిమాలలో నిర్మాతల మీద ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈరోజుల్లో చాలా మంది స్టార్స్ లాభాల్లో వాటా తీసుకునేందుకే చుస్తునారు.
పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్ క్రేజ్ గ్లోబల్ రేంజ్‌కు వెళ్లడంతో, బన్నీ చేయబోతున్న సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చిన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మరోతోంది. ‘రాకా’ సినిమా బడ్జెట్ మరియు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ పై వస్తున్నన్యూస్ లో క్లారిటీ లేదు సో ఈ న్యూస్ కేవలం రూమర్స్ గానే పరిగణించవచ్చు. ఈ న్యూస్ అఫీషియల్ అయితే కాదు. సో ఫైనల్ గా అల్లు అర్జున్, అట్లీ కలయికలో రాబోతున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరో భారీ సంచలనం సృష్టించడం పక్కా అని తెలుస్తోంది .



